వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గమైన కడప జిల్లా పులివెందులలో పార్టీలో పాత పగలు భగ్గుమన్నాయి. జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఇంటింటికి పాదయాత్రలో అదే పార్టీకి చెందిన రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి.రాత్రి రెండు వర్గాలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ గొడవలో పలువురి తలలు పగిలాయి.
వీరన్నగట్టుపల్లెకు చెందిన పుల్లయ్య వర్గంపై .. ఇడుపులపాయకు చెందిన చలపతి వర్గం దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. వారు ప్రతిఘటించడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. పాత పగను మనసులో పెట్టుకొనే తమపై దాడి చేశారని పుల్లయ్య వర్గం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.