సినిమా ఆర్టిస్టుల అసోసియేషన్ మా డైరీ ఆవిష్కరణ సభ రచ్చ రచ్చ అయ్యింది. లైవ్‌లోనే హీరోలు చిరంజీవి, రాజశేఖర్‌లు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్య పోయారు. ప్రోటోకాల్ పాటించకుండా, మైక్ లాక్కొని మాట్లాడటం సరైంది కాదని రాజశేఖర్‌పై చిరంజీవి కామెంట్ చేశారు. చిరంజీవి ప్రసంగానికి రాజశేఖర్ పదే పదే అడ్డుకోవటంతో వివాదం మొదలైంది. మంచి ఉంటే అందరి ముందు చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండి అంటూ చిరంజీవి మా విబేదాలపై కామెంట్స్ చేశారు. మా అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్‌ను చిరంజీవి వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయటంతో అసలు గొడవ ప్రారంభం అయ్యింది.
ఇండస్ట్రీలో నిప్పు రాజేసుకుందన్న రాజశేఖర్… నా కుటంబంలో కూడా విభేదాలు వచ్చాయంటూ సంచలన కామెంట్స్ చేశారు రాజశేఖర్. అందుకే తనకు కారు ప్రమాదం కూడా జరిగిందని విమర్శించారు. రాజశేఖర్ మైక్‌ను అక్కడున్న వారు కూడా లాక్కోవటంతో రాజశేఖర్ అలిగి వెళ్లిపోయారు.
మొత్తం వివాదంపై సీనీయర్ నటుడు కృష్ణం రాజు, పరుచూరి గోపాలకృష్ణ గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.