రొమాంటిక్ కామెడీకి ముహుర్తం పెట్టిన క్లాస్ డైరెక్ట‌ర్ - Tolivelugu

రొమాంటిక్ కామెడీకి ముహుర్తం పెట్టిన క్లాస్ డైరెక్ట‌ర్

శేఖ‌ర్ క‌మ్ముల. క్లీన్ ఎంటర్ టైన‌ర్ సినిమాల‌కు పెట్టింది పేరు. పైగా లో బ‌డ్జెట్ తో మంచి వ‌సూళ్లు రాబ‌ట్ట‌గ‌ల ద‌ర్శ‌కుడు. సైలెంట్ గా త‌న ప‌ని తాను చేసుకోవ‌టం శేఖ క‌మ్ముల స్పెష‌ల్. ప్ర‌స్తుతం నాగ చైతన్య‌, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా ల‌వ్ స్టోరీ అనే విలేజ్ బ్యాక్ గ్రౌండ్ ల‌వ్ స్టోరీని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూట్ ఫైన‌ల్ ద‌శ‌లో ఉండ‌గా… వ‌చ్చే సంవ‌త్స‌రం సినిమా రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది.

ఓ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు శేఖ‌ర్ క‌మ్ముల మ‌రో సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్ట‌ర‌న్న పేరుంది. కానీ లాక్ డౌన్ కార‌ణంగా త‌న స్టైల్ కు భిన్నంగా శేఖర్ క‌మ్ముల ఓ రొమాంటిక్ కామెడీకి స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా పూర్తి చేశార‌ట‌. టాలీవుడ్ యంగ్ హీరోతో సినిమా చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ల‌వ్ స్టోరీ సినిమాను తెర‌కెక్కిస్తున్న ఏషియ‌న్ ఫిల్మ్స్ సంస్థ త‌రువాతి రొమాంటిక్ కామెడీని కూడా తెర‌కెక్కించ‌బోతుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp