హయత్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని తట్టి అన్నారం వైసీపీ కాలనీలో టెన్త్ క్లాస్ విద్యార్థినిపై ఐదుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆలస్యంగా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తట్టి అన్నారంలోని వైఎస్ఆర్ కాలనీలో టెన్త్ క్లాస్ విద్యార్థిని నివాసం ఉంటోంది.
ఆమెపై సహచర విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో వారు వీడియోలు కూడా తీశారు. ఆ వీడియోలను తోటి విద్యార్థులకు షేర్ చేశారు.
విషయం బయటకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ విద్యార్థినిని బెదిరించారు. పది రోజుల తర్వాత నిందితులు మరోసారి అత్యాచారం చేశారు.
విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై అత్యాచారం, ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.