పేద విద్యార్థుల ఆకలి తీర్చటం కోసం తెచ్చిన మధ్యాహ్నబోజన పథకంలో దొంగలు పడ్డారని, అన్నం-కూర సహ పలు పోషకాహారాన్ని అందించాల్సింది పోయి కేవలం రొట్టెలతో పాటు కొంత ఉప్పు మాత్రమే ఇస్తున్నారని జర్నలిస్ట్ పవన్ జైశ్వాల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ పరిశోధానత్మక స్టోరీ ఇచ్చారు. సహాజంగా అయితే అలాంటి స్టోరీ ఇచ్చినందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవటంతో పాటు సదరు జర్నలిస్ట్‌ను అభినందించాల్సింది పోయి జర్నలిస్ట్‌పైనే కేసులు పెట్టింది యూపీ ప్రభుత్వం.
అక్రమ కేసులపై జర్నలిస్ట్ సంఘాలు, పలు ప్రజా సంఘాలు ప్రభుత్వ చర్యను నిరసించాయి. దాంతో కాస్త వెనక్కి తగ్గిన యోగి సర్కార్… టీచర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది కానీ జర్నలిస్ట్‌పై కేసును అలాగే ఉంచింది. కానీ న్యాయపోరాటం తర్వాత ఎట్టకేలకు కేసు నమోదు చేసిన యూపీ మీర్జాపూర్ పోలీసులు కేసును వాపస్ తీసుకుంటున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.
దీంతో జర్నలిస్ట్ ఐక్యత గెలిచిందని… ఎంతో ధైర్యసాహసాలతో పేద విద్యార్థుల కోసం అద్బుతమైన పరిశోధనాత్మక కథనాన్ని వెలుగులోకి తెచ్చిన పవన్ జైశ్వాల్‌పై ప్రసంశల జల్లు కురుస్తోంది.
అయితే, ఇలా అక్రమ కేసులు నమోదు చేసి వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని… భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు జరగుకుండా చూడాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.