తాజ్ మహల్ పరిసర ప్రాంతంలో కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ కాలుష్యం వల్ల ఇప్పటికే తాజ్ మహల్ రంగు మారి తేజస్సును కోల్పోతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోయిందని పర్యావరణ కార్యకర్త లీసీ ప్రియా(10) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు.
తాజ్ మహల్ చుట్టూ పేరుకు పోయిన ప్లాస్టిక్ చెత్త కనిపించేలా ఓ ఫోటోను ఆమె తీశారు. అందులో ఆ చెత్త పక్కనే ప్లకార్డ్ పట్టుకుని ఆమె నిలబడి ఉన్నారు. ఈ ఫోటోను ఆమె ట్వీట్ చేశారు.
‘ తాజ్ మహల్ అందం వెనుక ప్లాస్టిక్ కాలుష్యం అంటూ ప్లకార్డ్ లో రాశారు. మానవులందరి ధన్యవాదాలు.. మీరు ఇది బాగా కలుషితం చెందింది అనవచ్చు కానీ మీరు పడేసిన ఓ పాలిథిన్ బ్యాగ్, ఓ వాటర్ బాటిల్ ఈ పరిస్థితి కారణమైంది’ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.