తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కరెంట్ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. రోజుకు 2 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉండగా.. అర టీఎంసీ నీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి.
రెండు రోజుల క్రితం కేవలం 0.4 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి సీరియస్ అయ్యారు. ఈక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టును మూసివేయాలని డిమాండ్ చేశారు.ఈ గుదిబండ తెల్ల ఏనుగు ప్రాజెక్టు రోజుకు 2 టీఎంసీల నీళ్లను తోడాల్సింది కేవలం 0.4 టీఎంసీ అంటే 20 శాతం నీళ్లనే పంపు చేయగలుగుతుందని మండిపడ్డారు.
ఒక ఎకరం పంటకు రైతులు ఒక లక్ష ఖర్చుపెడుతున్నారు..కానీ నీటి సరఫరాలో మాత్రం ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం రైతులకు ఎకరానికి 25000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మూసెయ్యాలని, రాష్ట్ర ఆర్థిక వనరులను కాపాడాలని ఆయన ట్వీట్ చేశారు.