బట్టి విక్రమార్క
కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలందరికీ ఒక మంచి భవిష్యత్ ఇచ్చేందుకు ఎంతో కృషి చేసాయి. స్వాతంత్య్రానికి పూర్వం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా కు వచ్చి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చింది. నేడు మరోసారి మోడీ ప్రభుత్వం దేశాన్ని వ్యాపార శక్తులకు ధారాదత్తం చేసేందుకు కుట్ర చేస్తుంది.
మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. దేశంలో 2 కోట్ల మంది రైతుల సంతకలతో సోనియాగాంధీ రాష్ట్రపతి కి వినతి పత్రం ఇచ్చింది. అయినా కూడా మోడీ ప్రభుత్వం వ్యాపారులకు మద్దతుగా నిలుస్తుంది. మూడు చట్టాలు వ్యాపారులకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ఈ చట్టాల వల్ల దేశ రైతాంగానికి, ఆహార ధాన్యాలు దొరకక వినియోగ దారులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది.
కార్పొరేట్ సంస్థలకు రైతులు దాసోహం కాకుండా వేల మంది రైతులు దీక్షలు చేస్తున్నారు. వారికి దీక్షలు చేస్తున్నారు. వారికి సంఘీభావం తెలిపేందుకు ఈ దీక్ష చేస్తున్నాము.మా దీక్షకు రైతుల నుంచి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. కేసీఆర్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రబుత్వాలు రైతులకు అనేక సౌకర్యాలు కల్పించాము. సబ్సిడీ డ్రిప్ ఇర్రిగేషన్, విత్తనాలు, పావలా వాడికే రుణం,ఐకెపి సెంటర్లు అనేక సౌకర్యాలు కల్పించాం. తెలంగాణ సంగతి కేసీఆర్ కు పూర్తిగా తెలియదు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఏమి జరిగిందో చరిత్ర తెలుసుకో. రైతుల కోసం పని చేయాలి..నష్టం వచ్చిందని పంటలను కొనుగోలు చేయమని చెప్పడం కేసీఆర్ ముకరత్వం. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన తర్వాత వ్యవసాయ చట్టాలపై యూ టర్న్ తీస్కున్నారు.. కేసీఆర్ వ్యవసాయ చట్టాలపై మారాడు. ఆయనకు బుద్ది చెప్పాలి. టిఆర్ఎస్ నాయకులను గ్రామాల్లో తిరగణియ్యొద్దు. కాంగ్రెస్ పార్టీ పక్షాన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. వివిధ వర్గాల ద్వారా రైతుల దీక్షలకు 4 లక్షల రూపాయలు అందించారు. సియేల్ప్ పక్షాన ఒక నెల జీతం రైతుల దీక్షలకు అందిస్తాం. రైతులు చేస్తున్న దీక్షలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాం కానీ ప్రత్యేకంగా పాల్గొనడ లేదు. కాంగ్రెస్ పార్టీ పాల్గొంటే రాజకీయ కుట్ర అని చెప్పి మోడీ ఆ ఉద్యమం అణచివేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన గ్రామ గ్రామాల్లో తిరిగి రైతులతో ముఖ ముఖి చేస్తాం.. కేసీఆర్ మెడలు వంచి రాష్ట్రంలో ప్రతి గింజ కొనే వరకు పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్యా పరిరక్షణ కోసం.. పోరాటం కొనసాగిస్తాం.. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు.