భట్టి విక్రమార్క
కొనుగోలు కేంద్రాలు, పావలావడ్డీ రుణాలు, వడ్డీలేని రుణాలు ఐకేపీ కేంద్రాలు ఎత్తేస్తే రైతుల భవిష్యత్ ఏమిటి? ఇలాంటి పరిస్థితులు ఎదరయితే.. రైతులు పంటలు పండిస్తారా? పంటలు బంద్ పెడితే.. ప్రజల పరిస్థితి ఏమిటి ? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాములా రైతులను కాటేసేందుకు వస్తోందని.. అలాగే తేలుగా కేసీఆర్ నక్కినక్కి రైతులను కుట్టేందుకు వస్తున్నారు. ఇలాంటి పాములపై ములుగర్రను, తేలుపై చెప్పును ఎత్తాలి.. ఇలాంటి వారిని కొట్టకపోతే.. రైతులు తీవ్ర నష్టాల్లోకి కష్టాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. రైతులు రోడ్ల మీదకు వచ్చి వీళ్లకు కర్రు కాల్చి వాతలు పెట్టాలి. లేకపోతే మనల్ని మనం రక్షించుకోలేకము.
ఇదిలావుండగా.. కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వస్తే.. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని సబ్సిడీలు కొనసాగిస్తాము. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ఒక పెద్ద మూర్ఖుడు. రైతులతో ముఖాముఖి అనేది ఒక రాజకీయ సభ కాదు.. ఇప్పడు ఓట్లు లేవు.. ఇప్పడున్న ప్రభుత్వాలకు మరో మూడేళ్ల అధికారం ఉంది.కానీ.. వాళ్ల ఇష్టారీతిన పాలన చేసుకుంటూ పోతే.. రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఇబ్బందుల్లో పడతారు ఆ విషయాలను ప్రజలకు వివరించివారి మధ్య చర్చ జరగాలని మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్న. పొలాల్లో.. గ్రామాల్లో.. అన్ని చొట్లా దీనిపై చర్చలు జరిగితేనే పరిష్కారాలు వస్తాయి. రైతులతో ముఖాముఖి-పొలంబాట, పోరుబాట కార్యక్రమాల్లో అనేకచోట్ల రైతులు మవాళ్ల కష్టాలను చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు అందుబాటులో లేరు. ఫసల్ బీమా యోజన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ.960 కోట్ల రూపాయలు కట్టకపోవడం వల్ల మాకే బీమా రాలేదని ఆదిలాబాద్ జిల్లా రైతులు బాధపడ్డారు. అలాగే మంచిర్యాల రైతులు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని సబ్సీడీలను ఆపేసింది. ఇప్పుడ కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే.. మా పరిస్థితి అగమ్య గోచరమని అంటున్నారు.
రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబెట్టేందుకు సీఎల్పీ బృందం ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తేసేందుకు సిద్ధమవుతోంది. ప్రతి పేదవాడికోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కేంద్రం చీకటి చట్టాలను ప్రవేశపెట్టింది. రైతుల పక్షాన పోరాటం చేయాలి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో రైతుల పక్షాన పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కిందకు దించాలి. డీజిల్ ధరలు రెండు రోజుకోసారి పెరగుతున్నాయి. రూ. 200 వరకూ పెరిగే ప్రమాదం ఉంది. డీజిల్ ధరలు పెరడం వల్ల రైతులకు తీవ్రస్థాయిలో నష్టం జరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల సామాన్యులు నష్టపోతున్నారు. మూడు నల్ల చట్టాల వల్ల కనీస మద్దతు ధర రైతులకు ఉండదు. మద్దతు ధర లేకపోతే.. రైతులు తీవ్రంగా నష్టపోతారు. నా జిల్లాలో హత్య చేబడ్డ న్యాయవాద దంపతుల హత్యపై నిష్పక్షపాత విచారణ జరపాలి. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. ఒక మహిళను నడిరోడ్డుపై హత్య చేస్తే.. ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్.. ఎవరూ మాట్లాడరు.
పోరాటం చేయకపోతే పొలాలు, భూమలు పోతాయి. రైతు వ్యతిరేక చట్టాల వల్ల అంబానీ, అదానీలు అక్కునే పరిస్థితులు వస్తాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, మోడీ, కేసీఆర్ లను దించాలి. కేసీఆర్ ఒక పెద్ద దోపిడీ దొంగ. కేసీఆర్ యూటర్న్ తీసుకుని మోడీకి గులాం చేస్తున్న కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలి. లోఫర్ ప్రభుత్వాలను గద్దె దించకపోతే.. మనకు మనుగడ ఉండదు.