భట్టి విక్రమార్క సీఎల్పీ నేత
ముఖ్యమంత్రి మాటల్లో నిరాశ, నిస్పృహలు స్పష్టం గా కనిపిస్తున్నాయి. ఒక్కరోజుకే బెంబేలు ఎత్తితే ఎలా రైతు యాత్ర ఇంకా చాలా రోజులు జరుగుతుంది. రైతులు మాట్లాడుతుంటే కేసీఆర్ బెంబేలు అవుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల్లో ఉండి, వారి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాన్ని ఎండగట్టడమే నా పని. నీటిపారుదల ప్రాజెక్ట్స్ పై ఢిల్లీ నిపుణుల కమిటీ చేత దర్యాఫ్తు చేయిచేస్తే నిజాలు నిగ్గుదేలతాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి 100 కిలోమీటర్లు కిందకు తీసుకు వెళ్ళావు. కాళేశ్వరం ప్రారంభం చేశావు కానీ ఒక్క ఎకరానికి నీళ్ళు పారలేదు. కాళేశ్వరానికి చేసిన ఖర్చు ఎంత? ఇచ్చిన నీళ్లు ఎన్ని?? అన్న విషయంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థచేత దర్యాప్తు చేసేందుకు సిద్ధమా?? కేసిఆర్ నోరు తెరిస్తే చెప్పేవన్నీ అబద్దాలే.
ఇక్కడ కొట్లాట ఢిల్లీ లో దోస్తానా.సాగర్ తో నీ పతనం ప్రారంభం. భారీ మెజారిటీ తో కాంగ్రెస్ గెలవబోతోంది.ప్రాజెక్ట్స్ పేర్లతో దోపిడీ బయటపడేసరికి బెంబేలు ఎత్తి పోయావు. రైతుల పక్షాన ఉంటావా మోడీ పక్కన ఉంటావా. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టావు.ప్రజల తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నీటిపారుదల ప్రాజెక్ట్స్ దోపిడీ పై చర్చకు నేను సిద్ధం, కేసిఆర్ నీవు సిద్దమా. లెక్కలు తో సహా నిరూపణకు నేను సిద్ధం. విజిలెన్స్ కమిషన్, సీబీఐ లేదా మరో స్వతంత్ర సంస్థ తో దర్యాప్తుకు సిద్దమా.
సీఎం గా మీరు, ప్రతిపక్ష నాయకుడి గా నేను ఇద్దరం లెటర్స్ రాద్దము దర్యాప్తు చేయిoచమని. యాత్ర పూర్తి అయ్యాక రైతుల సమస్యల పై చర్చకు నేను సిద్దం నీవు సిద్ధమా. ఏ నీటిపారుదల ప్రాజెక్ట్ దగ్గర అయినా నేను బహిరంగ చర్చకు సిద్దం ముఖ్యమంత్రి సిద్దమా.