సీఎం కేసీఆర్ కు రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. భారత్ బంద్ కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించటం కేవలం కంటి తుడుపు చర్యేనని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని భట్టి డిమాండ్ చేశారు. దేశమంతా ఆందోళనలో ఉంటే.. కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో ఉన్నారని, దీన్ని బట్టి కేసీఆర్ ఎలాంటి వారో అర్థం చేసుకోవాలన్నారు.