అసెంబ్లీకి ఎలా వెళ్లాలనేది ఎమ్మెల్యేలుగా మా ఇష్టం… మా హక్కులను కాలరాస్తూ సభకు హజరుకాకుండా పోలీసులు అడ్డుకున్నారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. శాంతియుతంగా, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్తే… తమను అరెస్ట్ చేశారన్నారు.
దేశంలో, రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర ధరలపై నిరసన చేస్తున్నా కాంగ్రెస్ నేతలను అడ్డుకోవటంపై భట్టి మండిపడ్డారు. రవాణా వ్యవస్థను భరించలేని పరిస్థితి ఉందని ప్రభుత్వానికి చెప్పడం కోసం గుర్రపు బండిపై వెళ్తే అడ్డుకున్నారన్నారు. దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెట్టేశాయని దీనిపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ లు సమాధానం చెప్పాలన్నారు. సభ్యులుగా మా హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్, చైర్మన్ కు ఉందన్న భట్టి, అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇదేనా కోరి తెచ్చుకున్న తెలంగాణ… చైర్మన్, స్పీకర్ నుంచి స్పష్టమైన సమాధానం కోరుతున్నామన్నారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామని మండిపడ్డారు.