కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఇది దుర్మార్గమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణకు న్యాయంగా విభజన చట్టం ప్రకారం రావాల్సిన అంశాలేవీ సాధించకుండా టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట ఫ్యాక్టరీ, పరిశ్రమలతో పాటు డ్రైపోర్టు ఏమైందని… విభజన హామీలు సాధిస్తామని గెలిచిన బీజేపీ, టీఆర్ఎస్ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు ఢిల్లీలో ఒక్కటిగా పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు.
బడ్జెట్ పూర్తిగా నిరాశపర్చిందని… ఇందుకు స్థానిక నేతలే బాధ్యత వహించాలన్నారు.