భట్టి విక్రమార్క
కేసీఆర్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. ఐకేపీ సెంటర్లు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేయడం వల్ల ఇటు మహిళలు, అటు రైతులను దెబ్బకొడుతున్నారు. రేగుపళ్ళు తిని రేగుపళ్ళు అమ్ముకునే మనం.. ఇప్పుడు ఐదు వేళ్ళతో అన్నం తినేందుకోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టించింది. నాగార్జున సాగర్ సహా ఎన్నో ప్రాజెక్టులు కట్టించింది. ఆ ప్రాజెక్టుల పుణ్యమే మనమందరం అన్నం తినగలుగుతున్నాము. ఐకేపీ సెంటర్లు నెలకొల్పి మద్దతు ధర ఇచ్చి దళారుల చేతుల్లో రైతులు మోస పోకుండా నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను కాపాడాయి.
కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల మద్దతు ధర ఉండదు. గిట్టుబాటు ధర ఉండదు. నష్టాలను తట్టుకొని రైతు నిలబడలేడు, భూమిని అమ్ముకోవడమో, ఊరిని వదిలి పెట్టటమో చెయ్యాల్సి వస్తుంది. మహిళలు, రైతులకు రెండు విధాలుగా ఉపయోగపడే కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తే సహించేది లేదు. సబ్సిడీస్ తో పనిముట్లు, వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు, మద్దతు ధర లేకుండా చేసి కంటి తుడుపుగా ఇచ్చే రైతు బందుతో లాభం లేదు. కేసిఆర్ విధానాల కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. రుణమాఫీ అమలు చేయకుండా రైతులను కేసిఆర్ మోసం చేస్తున్నాడు. రుణమాఫీ హామీ అమలు చేయక పోవడంతో రైతు రుణ భారం పెరిగిపోతోంది. ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పడం ఆ తరువాత మోసం చేయడం కేసిఆర్ నైజం.