భట్టి విక్రమార్క సీఎల్పీ నేత
* సీఎం కేసీఆర్ మాటలను చూస్తుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఉంది.
* రాష్ట్రాన్ని దివాలా తీయించి…కేసీఆర్ పాలన చేయలేక రాష్ట్రాన్ని ప్రైవేటికరణ చేస్తున్నారు.
* ఇప్పటికే మూడు లక్షల…రాబోయే రోజుల్లో మరో మూడు లక్షల అప్పులు చేసేటట్లు ఉన్నారు.
* రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళింది.
* రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ ఆర్టీసీ…6 ఏండ్లలో దివాలా తీయించి ప్రైవేట్ పరం చేస్తున్నారు.
* కార్మికుల మరణాలకు ప్రతిపక్షాలు కారణం కాదు..ప్రభుత్వమే కారణం.
* కేసీఆర్ గతంలో చెప్పిన హామీలను కార్మికులు ఇవ్వాళ అడుగుతున్నారు.
* కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి అందుకే ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయి.
* ప్రజలతో ఉన్న రూట్లను ప్రైవేటీకరణ చేయడం అంటే అమ్మడం అన్నట్లే.
* ఆర్టీసీ ఒకరోజుతో నిర్మించింది కాదు..దశాబ్దాల ఆస్తులు.
* ఆర్టీసీ పై ఏ నిర్ణయం అయినా చట్ట సభల్లో చర్చలు జరపాలి.
* ఆర్టీసీ అనేది ప్రజలకు సేవ చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ.
* కేసీఆర్ క్యాప్తలిస్ట్, ఫ్యూడలిస్ట్ భావంతో ఉన్నారు.
* తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేల్కోవాలి.
* ఇవ్వాళ ఆర్టీసీ, రేపు సింగరేణితో పాటు ఆస్తులన్ని అమ్మకానికి పెట్టినా ఆశ్చర్యపోవాల్సినవసరం లేదు.
* తెలంగాణ రాష్ట్రం సొంత ఎస్టేట్ కాదు.
* మంచి పాలన ఇవ్వాలని కేసీఆర్ కి ప్రజలు ఇచ్చారు.
* ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారు.
* ప్రజల ఆస్తులు..ప్రజల రూట్లు ప్రైవేటికరణ చేసేందుకు కేసీఆర్ ఎవరు?
* ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలి.