మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ లీడర్
దళిత బంధు పథకం కింద ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తామని చెప్తున్న రూ. 10 లక్షలు ఆయన సొంత డబ్బు కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఈ పథకం ఒక భాగం మాత్రమే. దళిత బంధు పథకాన్ని ఏదో ఒక్క నియోజక వర్గానికి పరిమితం చేయొద్దు. రాష్ట్రమంతా ఈ పథకాన్ని అమలు చేయాలి. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కోసం నియోజకవర్గాల వారీగా నియమించిన కో- ఆర్డినేటర్లు తమ ప్రాంతాల్లో ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరముంది. నియోజక వర్గాలలో కో ఆర్డినేటర్ల పాత్ర చాలా కీలకం. అందరినీ సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి.