సూర్యోదయం చూసి సంతోషించనివారు ఉండరు.సూర్యుడి అరుణారుణ కాంతులంటే అందరికీ ఇష్టమే.అలాగే సూర్యుడిని దగ్గరగా చూస్తే బాగుంటందనే కోరిక కూడా మనకు అప్పుడప్పుడూ వస్తూ ఉంటుంది. కానీ అది అసాధ్యం అనే విషయం మనకు తెలుసు.కానీ..సూర్యుడిని దగ్గరగా చూడాలనుకునేవారి కోరికను తీర్చాడో ఫోటోగ్రాఫర్.
ఆండ్రూ మెక్కార్తీ అనే ఫోటో గ్రాఫర్ ..సూర్యుడు అతి దగ్గరగా కనిపించేలా తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు సూర్యుని ఉపరితలాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.టెన్నిస్ బాల్ పై కనిపించే పీచులా సూర్యుని ఉపరితలం కూడా ఈ ఫోటోల్లో కనిపిస్తోంది.
ఆండ్రూ మెక్కార్తీ తను తీసిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేస్తూ.. పిక్స్ తీసిన విధానాన్ని కూడా వివరించారు. ఇప్పటి వరకూ 150,000కు పైగా సూర్యుడి పిక్స్ను తీశానని మెక్ కార్తీ తెలిపారు. తాను అభివృద్ధి చేసుకున్న టెలిస్కోప్ తో 300 మెగాపిక్సెల్స్ ఉపయోగించి ఈ ఫొటోలను తీశానని తెలిపారు.