విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి ఘటనలో 12మంది మరణించారు. సీఎం జగన్ ఘటన జరగ్గానే విశాఖలో పర్యటించటంతో పాటు తక్షణ ఉపశమనంగా మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కోటి పరిహరం ఇస్తున్నట్లు తెలిపారు.
అయితే… కోటి రూపాయలు అనేది చాలా పెద్దం మొత్తం అయినా, ఆ ప్రకటన వెనుక కారణాన్ని సీఎం జగన్ తాజాగా వెల్లడించారు. గతంలో ఓఎన్జీసీ గ్యాస్ లీకైన ఘటనలో ప్రతిపక్ష నేతగా తాను కోటి రూపాయలు డిమాండ్ చేయగా, కంపెనీ 20లక్షలు, కేంద్రం 3లక్షలు, రాష్ట్రం 2 లక్షల సహాయాన్ని ప్రకటించాయన్నారు.
కానీ విదేశాల్లో ఇలాంటి గ్యాస్ లీకేజ్ ఘటనల్లో నష్ట పరిహరాలు షాక్ కొట్టేలా ఉంటాయని… దాంతో వాటికి తీసిపోని విధంగా కోటి రూపాయాలు ప్రకటించామని వెల్లడించారు. ఇలా భారీ జరిమానాలుంటేనే కంపెనీలు కూడా అప్రమత్తంగా ఉంటాయని, తమ నుండి జరిగే తప్పులు మళ్లీ మళ్లీ జరగకుండా ఉంటాయని సీఎం జగన్ వెల్లడించారు.