నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో సంక్షేమ పథకాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. జిల్లా కేంద్రంలోని మౌలిక వసతులు అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.
అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపట్టాలని అధికారులకు సూచించారు కేసీఆర్. ఇప్పటి వరకు రాష్ర్టంలో అమలవుతున్న పథకాలతో పాటు సమస్యలపై చర్చించారు. పోడు భూముల సమస్య, మెడికల్ కాలేజీ నిర్మాణం, దళిత బంధు పథకం అమలుపై అధికారులతో మాట్లాడారు సీఎం. అంతకుముందు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి దశ దిన కర్మలో పాల్గొన్నారు కేసీఆర్. కిషోర్ కుటుంబాన్ని పరామర్శించారు.
పీటీఆర్ కాలనీలోని కిషోర్ నివాసానికి వెళ్లిన సీఎం.. ఎమ్మెల్యే తండ్రి మారయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కిషోర్ తండ్రి మారయ్య ఇటీవలే గుండెపోటుతో మరణించారు.