అక్రమాస్తుల కేసులో ఈ నెల 22వ తేదీన ఈడీ కోర్టుకు ఏపీ సీఎం జగన్ హజరవ్వాల్సి ఉంది. అయితే, తాను అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున వ్యక్తిగతంగా హజరుకాలేనంటూ సీఎం జగన్ అబ్సెంట్ పిటిషన్ వేశారు. వాన్ పిక్, లేపాక్షి కేసుల్లో జగన్ ఈడీ కోర్టుకు హజరుకావాల్సి ఉంది.
ఈ రెండు కేసుల్లో జగన్ ఏ1గా ఉండగా, ఎంపీ విజయసాయి రెడ్డి ఏ2గా ఉన్నారు. ఈ కేసులోనే ఎంపీ మోపిదేవి, నిమ్మగడ్డ, మాజీ మంత్రి ధర్మానలపై కూడా అభియోగాలున్నాయి. క్విడ్ ప్రొకో జరిగిందన్న ఆరోపణలపై ఈడీ విచారిస్తుండగా… పలువురు సివిల్ సర్వీసు అధికారులు కూడా ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ ఈ కేసులను విచారించేందుకు హైకోర్టు అనుమతించింది. అయితే, దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఎంపీ విజయసాయి వాయిదాలు కోరుతున్నారు.