అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇటీవల జరిగిన పరిణామాలు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి. వైసీపీ నేత, ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వయంగా తన అనుచరులతో జేసీ ఇంటికి వెళ్లటం, కత్తులతో వస్తున్న అనుచరుల వీడియోలు అన్ని భయటకు వచ్చేశాయి. మరోవైపు జేసీ బ్రదర్స్ దీక్షలకు పిలుపునివ్వటంతో పరిస్థితి మరింత వేడేక్కింది.
తాజాగా ఎమ్మెల్యే పెద్దారెడ్డిని సీఎం జగన్ స్వయంగా పిలిపించుకొని మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా హాజరైనట్లు ఏపీ సీఎంవో వర్గాల సమాచారం. మీ చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, జేసీ బ్రదర్స్ సానుభూతి కోసం వెంపర్లాడుతున్న సమయంలో కత్తులతో మీరు వారింటికి వెళ్లటం అవసరమా అంటూ జగన్ కాస్త గట్టిగానే ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తాను కేవలం మాట్లాడేందుకే ఇంటి వెళ్లానని ఎమ్మెల్యే చెప్పగా… కత్తులతో ఏం పని అంటూ ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నుండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి పంపినట్లు వైసీపీ వర్గాలంటున్నాయి.
అయితే, అనంతలో ఈ మాత్రం దూకుడు లేకుంటే వారిని మనవాళ్లు తట్టుకోవటం అంత హిజీ కాదంటూ కొందరు నేతలు జగన్ కు సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా… పార్టీని బజారుకిడ్చకుండా మనవాళ్లు నడుచుకోవాలని, అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి ఛాన్స్ ఇస్తే ఎలా అంటూ జగన్ వ్యాఖ్యానించినట్లు చర్చ సాగుతోంది.