ఏపీలో చదివే విద్యార్థులకు ముఖ్యమంంత్రి జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంలో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకూ చదివే స్టూడెంట్స్‌కు అమ్మ ఒడి పథకం డబ్బులకు బదులుగా ల్యాప్‌టాప్ కూడా ఇస్తామని ఆఫర్ చేశారు. అమ్మ ఒడి డబ్బులు కావాలా? ల్యాప్టాప్ కావాలా? అనేది ఎంచుకోవడం విద్యార్థులు, తల్లిదండ్రులు ఇష్టమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ అవకాశాన్ని కల్పించబోతున్నట్టు అనౌన్స్ చేశారు.
తామిచ్చే ల్యాప్ టాప్ మార్కెట్ లో రూ. 25 వేల నుంచి 27 వేల రూపాయల ధర ఉంటుందని.. అయితే ప్రభుత్వం వాటిని రూ. 18 వేల 500కే అందిస్తుందన్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే పలు డెల్, లెనోవో, హెచ్‌పీ వంటి కంపెనీలతో చర్చలు జరిపిందని తెలియజేశారు. త్వరలోనే టెండర్స్ వేస్తామని.. ఆ తర్వాత రివర్స్ టెండర్ కూడా వేసి మరింత తక్కువ ధరకే ల్యాప్‌టాప్ లభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మూడేళ్ల వారంటీతో పాటు..ఏడు రోజుల్లో ఏదైనా ఇబ్బంది వస్తే.. రిప్లేస్‌మెంట్ లేదా రిపేర్ చేసే విధంగా ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకోబోతున్నట్టు వివరించారు ధనవంతుల పిల్లలకు పోటీగా.. ప్రతి విద్యార్థిని చదువుకొనే విధంగా తయారు చేయడమే లక్ష్యమని జగన్ చెప్పుకొచ్చారు.