రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది పీటర్ కమిటీ. రాజధానిలో జరుగుతున్న ప్రాజెక్టులు, నిర్మాణాలన్నింటిని పునఃసమీక్షించాలని, 30 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నివేదికలో పీటర్ కమిటీ పేర్కొంది. ప్రస్తుతానికి 75 శాతం పనులు పూర్తయిన నిర్మాణాలు ప్రాజెక్ట్ లను ఏమి చెయ్యాలి అనే నిర్ణయం ప్రభుత్వానికి వదిలేసింది.
ఇప్పటికే రాష్ట్రాభివృద్ధి, రాజధాని నిర్మాణం, ప్రణాళికలు, సూచనలు సలహాలు కోసం సెప్టెంబర్ 13న మరో నిపుణుల కమిటీ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సమావేశం రిటైర్డ్ ఐఏఎస్ జి ఎస్ రావు నేతృత్వం లో విజయవాడలో జరిగింది.