టీడీపీ సర్కార్, చంద్రబాబు ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారు అంటూ విమర్శించిన ఏపీ సీఎం జగన్… మంచినీళ్లకు, స్నాక్స్ ఖర్చులను పూర్తిగా తగ్గించేశారు. గత ప్రభుత్వ హయాంలో బాదం పప్పుకు ఇన్ని లక్షలా, టీ కోసం ఇంత ఖర్చు పెట్టారా అంటూ విమర్శించారు.
కానీ తాను విమర్శించిన అంశాలనే… అధికారం అలవాటు కాగానే మర్చిపోయినట్లున్నారు. ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హజరయ్యేందుకు 60లక్షలు ఖర్చు అవుతుందని తానే చెప్పారు. ఇప్పుడు సీఎం జగన్ తన కూతురును కాలేజీలో జాయిన్ చేసేందుకు వెంట వెళ్లిన అధికారుల ఖర్చు చూసి ఇతర అధికారులే ఆశ్యర్యపోతున్నారు. వెంట వెళ్లి, తిరిగి వచ్చినందుకు అయిన ఖర్చు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. విమాన ఖర్చులు, సెక్యూరిటీ, ఇతరత్రా కలిపి దాదాపు 92లక్షల బిల్లు ప్రభుత్వానికి అప్పజెప్పారు.
దీంతో కూతురు అమెరికా చదువుకు ప్రభుత్వ సొమ్ముతో పంపాలా జగన్… అంటూ సోషల్ మీడియాలో జనం ట్రోల్ చేస్తున్నారు.