ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. 9 గంటలకే ప్రారంభం అవుతాయని షెడ్యూల్ ప్రకారం ప్రకటించారు. కాని అవలేదు. ఎందుకు అవలేదని.. చాలామంది అనుకున్నారు. మీడియాలో కూడా అదేంటి టైమ్ కి కరెక్టుగా ప్రారంభిస్తారు కదా.. ఎందుకని స్టార్ట్ చేయలేదని చర్చ జరిగింది. బహుశా అజెండాపై ఏమైనా చర్చిస్తున్నారేమో.. లేక స్పీకర్ ఏమైనా వ్యవహారాలు పెండింగ్ ఉండి లేటు చేశారేమో.. లేక ఏకంగా బీఏసి సమావేశం పూర్తయ్యాకే ఒకసారే సమావేశాలు ప్రారంభిస్తారా ఇలా రకరకాలుగా చర్చ జరిగింది. కాని అసలు విషయం తెలుసుకుని అందరూ అవాక్కయ్యారు. ఆ అసలు విషయం కూడా చంద్రబాబు బయటపెట్టేవరకు చాలామందికి తెలియదు. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావడం లేటు అవడం వల్లనే అసెంబ్లీ సమావేశాలు లేటుగా ప్రారంభించారని తెలిస్తే ఎవరైనా షాక్ తింటారు.
సాధారణంగా సీఎం వచ్చినా రాకపోయినా సమావేశాలు ప్రారంభిస్తారు. గతంలో సైతం.. అసెంబ్లీలో వ్యూహం చర్చించడానికి ఒక్కోసారి సీఎంలు లేటు అయిన సందర్భాలు ఉన్నాయి. కాని స్పీకర్ ఆయన టైమ్ ప్రకారం ఆయన ప్రారంభించేసేవారు. తర్వాత సీఎం వచ్చి జాయిన్ అయ్యేవాళ్లు. కాని ఎక్కడా లేని విధంగా 151 ఎమ్మెల్యేల మద్దతున్న సీఎం మాత్రం.. ఆయనొస్తే గాని సభ ప్రారంభించడానికి వీల్లేదు. ఆయన చెబితే గాని అది మొదలవడానికి లేదు.. అదీ ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న ప్రజాస్వామ్యం.
అసలు ఈ పరిస్ధితి రావడానికి కారణం జగన్ ధోరణే. ఎందుకంటే ఏదీ ఆయనకు చెప్పకుండా చేయటానికి లేదు. ఏదీ ఆయన ఓకె అనకుండా కదలటానికి లేదు. అది స్పీకర్ అయినా అంతే.. డీజీపీ అయినా అంతే.. చివరకు ఎన్నికల కమిషనర్ అయినా అంతే. అంటే రాజ్యాంగబద్ధంగా బాధ్యతల్లో ఉన్నవారు సైతం.. సీఎం గారికి జీహూజుర్ అనాల్సిందే. లేదంటే తీసిపారేస్తారు. ఏ నిబంధనలను లెక్క చేయరు. పొరపాటున ఎవరైనా స్వతంత్రంగా వ్యవహరించి నిర్ణయం తీసుకుంటే.. వాళ్లకు జీవితాంతం టార్చర్ తప్పదు. వారిని పక్కన పెట్టేస్తారు. వాళ్లతో మాట్లాడటం మానేస్తారు. వారికి అపాయింట్ మెంట్ దొరకదు. పదవి ఉండి లేనివారిలా తయారవుతారు. అయితే వారన్నా ఎగ్జిట్ అయిపోవాలి.. లేదా కొన్నిరోజులయ్యాక వీరే పంపించేస్తారు. ఎల్వీసుబ్రమణ్యం, పీవీరమేష్ ఎపిసోడ్లన్నీ చూస్తే మనకు అర్ధమయ్యేది అదే.
ఇప్పుడు కూడా అంతే.. సంతాప తీర్మానాల్లో ఎవరి పేర్లు పెట్టాలో.. సంతాపం తర్వాత బ్రేక్ ఇచ్చాక.. ఏ అజెండా పెట్టుకోవాలో అంతా ఆయనతో చర్చించాకే చేయాలి. మరది జరగలేదు కాబట్టే స్పీకర్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. లేదంటే ఆయనకే తేడా వచ్చేస్తుంది మరి. ఏ సీఎం అయినా సరే అన్నీ ముందే మాట్లాడుకుంటారు.. కాని షెడ్యూల్ ప్రకారం జరిగేలా చూస్తారు. రేపు సమావేశాలు అంటే ఈ రోజే స్పీకర్ తో మాట్లాడుకుంటారు.. పార్టీ నేతలతోనూ, స్పీకర్ తోనూ సంప్రదింపులు చేసి.. అజెండా ఏం ఉండాలి.. ఎలా ఉండాలి.. ప్రతిపక్షాల వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలి వంటివాటిని కూడా అనథికారికంగా చర్చిస్తారు. ఎక్కడా షెడ్యూల్ ను డిస్ట్రబ్ చేయరు. కాని మన సీఎంగారి రూటే సెపరేటు. ఎవరైనా ఏమన్నా అంటారనే భయం ఏ కోశానా ఉండదు. తప్పు అయినా సరే నిర్భయంగా చేయడమే ఆయనగారి స్పెషాలిటి. అందుకే ఈరోజు సమావేశాలు లేటుగా ప్రారంభించడానికి కారణమయ్యారు. ఒకవైపు పంటలబీమాకు ప్రీమియం కట్టలేదు సామీ.. రైతులు నష్టపోతారని చంద్రబాబు మొత్తుకుంటుంటే.. నెలఖారుకు ఇస్తాను నీకెందుకు నువ్వు గమ్మునుండన్నట్లే వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైనా ఇలాంటి సీఎం నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్.