విజయవాడలోని ప్రైవేట్ కరోనా కేర్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. అలాగే అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
రమేష్ అస్పత్రికి సంబంధించిన కరోనా కేర్ సెంటర్‌గా స్వర్ణ ప్యాలెస్‌ను వినియోగిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.