కోడి పందాల బరుల వద్ద ముఖ్యమంత్రి జగన్ ఫ్లెక్సీలు హడావిడి చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని అంపాపురం గ్రామంలో మూడు ముక్కలాటకు గుడారాలు సిద్ధమయ్యాయి. కోడి పందాల బరువులు వద్ద పంచాయతీ సిబ్బందిని కూడా ఉపయోగించుకుంటున్నారు.
భారీ సెట్టింగులతో లక్షల రూపాయల ఖర్చుతో కోడిపందాల బరులు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో కోడి పందాల బరుల వద్ద సీఎం జగన్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ మేరకు నిర్వాహకులు వీఐపీ పాసులను కూడా సిద్ధం చేశారు.
కోడి పందాల వీఐపీ పాస్ ధర రూ.60వేలుగా నిర్ణయించారు. గ్రేట్ ఏ, గ్రేట్ బీగా పాసుల ధరలను కేటాయించారు. గ్రేట్ ఏ రూ.60 వేలు, గ్రేట్ బీ రూ.40 వేలుగా ఫిక్స్ చేశారు.
వీఐపీ పాస్ తీసుకున్నవారికి మూడు రోజుల పాటు ఫుడ్, క్వాలిటీ లిక్కర్, బెడ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆటగాళ్ల కోసం క్యూఆర్ కోడ్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తున్నారు. క్యాసినో కూడా నిర్వహిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.