కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్సాహంలో ఉన్న ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీని కలిశారు. గంటకుపైగా వీరి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి ఇరువురు చర్చించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మోడీకి జగన్ వివరించినట్లుగా సమాచారం. అలాగే కొత్తగా ఏర్పాటైన జిల్లాలపై కూడా ఇద్దరు మాట్లాడుకున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టుపైనా జగన్ పలు వినతులను మోడీ ముందు ఉంచినట్లు సమాచారం. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, రెవెన్యూ లోటు, తెలంగాణ నుంచి రావాల్సిన నిధులపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఇటు విభజన హామీల అమలు, ఇతర సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు పలువురు కేంద్రమంత్రులతోనూ జగన్ భేటీలు కొనసాగనున్నాయి.