ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇంకో పది రోజుల్లో పీఆర్సీ పై ఒక సానుకూల ప్రకటనను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ ను తిరుపతి సరస్వతీ నగర్ లో ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కలిశారు. పీఆర్సీపై విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం పీఆర్సీ ప్రక్రియ పూర్తయింది. పది రోజుల్లో సానుకూల ప్రకటన చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.