ఏపీలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున అధికారిక ఉత్సవాలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. దీనికి సీఎం భార్య భారతి కూడా హాజరయ్యారు. ముందుగా తండ్రి వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించారు జగన్. ఆ తర్వాత అక్కడున్న చిన్నారులతో ముచ్చటించారు. పంచాంగ శ్రవణంలో పాలుపంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన కీలక నేతలు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాదంతా రాష్ట్ర ప్రజలకు శుభాలు కలగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ప్రజలకు మంచి చేసే పరిస్థితులు రావాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో జరుగుతుంటుంది. లోకేష్ తన ప్రసంగాల్లో ఎప్పుడు తడబడతాడా? అని వైసీపీ.. జగన్ ఎప్పుడు దొరుకుతాడా? అని టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తుంటారు. అయితే.. ఉగాది సందర్భంగా జగన్ తడబడిన వీడియోను బాగా వైరల్ చేస్తున్నారు. అందులో ఉగాది శుభాకాంక్షలను జగన్ సరిగ్గా పలకలేకపోయారు. దీంతో ఆ చిన్న వీడియో బిట్ ను తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు.
టీడీపీ నేత బుద్ధా వెంకన్న తన ట్విట్టర్ ఖాతాలో జగన్ వీడియోను పోస్ట్ చేశారు. “అందరికీ ‘ఉబా ఉబా ఉబాది’ శుభాకాంక్షలు అంట.. ఒక్క పదం కూడా సరిగ్గా మాట్లాడలేవా?” అంటూ జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
అందరికీ "ఉబా ఉబా ఉబాది" శుభాకాంక్షలు అంట .. ఒక్క పదం కూడా సరిగ్గా మాట్లాడలేవా? pic.twitter.com/QsqtS051Yk
— Budda Venkanna (@BuddaVenkanna) April 2, 2022
Advertisements