ఏ పెళ్లికి వెళ్లినా… శుభకార్యానికి వెళ్లినా సహాజంగానే కాళ్లకు చెప్పులు విప్పి వధువరులను ఆశీర్వదించటమో… దేవున్ని దర్శించుకుండటమో చేస్తాము. అయితే, వీఐపీల్లో ఈ కల్చర్ ఎప్పుడో పోయింది. పైగా సీఎం, మంత్రుల స్థాయి అయితే… ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అంతా హడావిడిగా వచ్చామా వెళ్లామా అన్నట్లు ఉంటుంది.
సీఎం జగన్ మెదక్ ఎస్పీ చందనా దీప్తి పెళ్లికి హజరయ్యారు. ఇటు తెలంగాణ సీఎం కూడా వచ్చారు. సహాజంగానే రెండు రాష్ట్రాల అధికారులు, మంత్రులు కూడా పెళ్లిలో సందడి చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా అక్కడికి వచ్చిన అతిధులు ఎవరూ చేయని పనిని సీఎం జగన్ చేసి చూపించారు. ఇంతకీ ఆ పని ఎంటనే కదా….
ఈ ఫోటోను జాగ్రత్తగా గమనించండి… ఈ ఫోటోలో వదూవరులను సీఎం జగన్ ఆశీర్వదించి, ఫోటో దిగుతున్నారు. అయితే, ఆశ్యర్యకరంగా సీఎం మాత్రం చెప్పులు కిందే విప్పేసి… పెళ్లి మంటపంలోకి వచ్చారు. తన పక్కనున్న వారు ఎవరూ ఆ పని చేయలేదు. దీంతో సీఎం జగన్ పెళ్లికి, ఆచారాలకు ఎంత మర్యాద ఇస్తున్నారో అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.
ఇప్పుడే కాదు… ఇటీవల తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వనాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అందిస్తూ కూడా సీఎం జగన్ ఇలాగే చెప్పులు విప్పి, ఆహ్వన పత్రికను అందించారు. స్వతహగా క్ట్రిస్టియన్ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, హిందూ సాంప్రాదాయన్ని ఎంతో గౌరవిస్తున్నారన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐపిఎస్ చందన దీప్తి జగన్ సమీప బంధువును వివాహాం చేసుకుంది.
అయితే, ఇదంతా స్టంట్ అని, కేవలం ప్రచారం కోసమే జగన్ ఇలా చేస్తున్నారన్న వారూ లేకపోలేదు.