సీఎం జగన్ పగ తీర్చుకునే పనిలో పడ్డారా…? అక్రమాస్తుల కేసులో వెంటాడిన అధికారులను టార్గెట్ చేస్తున్నారా..? అంటే అవుననే కనపడుతోంది. సీఎం జగన్ హుందాతనంతో కాకుండా ప్రతీకారంతో రగిలిపోతున్నారని పలువరు అధికారులు వాపోతున్నారు.
బాలయ్యతో ఇప్పుడా హీరోయిన్ ఎలా రొమాన్స్ చేస్తుంది…?
ముఖ్యంగా జగన్ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్ విషయాలపై కూపీ లాగి… అసలు విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసిన సీనీయర్ ఐటీ అధికారి ఐ.ఆర్.ఎస్ క్రిష్ణ కిషోర్‌ను జగన్ ప్రభుత్వం వేధిస్తుందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. తన 27 సంవత్సరాల సర్వీస్‌లో ఎంతో మంచి రికార్డ్ ఉన్న అధికారిని జగన్ సర్కార్ వెంటాడుతోంది.
డిప్యుటేషన్‌పై ఏపీ సర్వీస్‌లో ఉన్న క్రిష్ణ కిషోర్‌ను రిలీవ్ చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నుండి రెండు సార్లు లేఖ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రిలీవ్ చేయాలని ఎన్నిసార్లు కోరినా, తన ప్రమోషన్ విషయం ఆలోచించాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదు.
2010 జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు సమయంలో… అడిషనల్ కమీషనర్‌గా ఉన్న క్రిష్ణ కిషోర్ జగతి పబ్లికేషన్స్‌పై దర్యాప్తు చేశారు. 18 రూపాయలు కూడా పలకని షేర్ ధరను 350రూపాయలు చేశారని… తద్వారా 272కోట్లకు సంబంధించి లెక్కలు చూపాలన్నారు. అప్పట్లో ఈ దర్యాప్తు కత్తిమీద సవాలు కావటంతో… ఉన్నతాధికారులు సైతం క్రిష్ణ కిషోర్‌ను అభినందించారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే నెం.1 ర్యాంకు రావటంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ఎకానామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ చీఫ్‌గా క్రిష్ణ కిషోర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారాలు ఇవ్వలేదు . భూములను ఇచ్చే అధికారం కూడా లేదు. కొత్త కంపెనీలకు, హమీలు ఇచ్చేందుకు అధికారమే లేకుండా పోయింది.
అంతేకాదు… అంత సిన్సియర్ అధికారికి ఆరు నెలల నుండి కనీసం జీతభత్యాలు కూడా ఇవ్వటం లేదని, ఎలాంటి పని కూడా అప్పగించలేదని తెలుస్తోంది. గతంలో తాను చేసిన దర్యాప్తును మనస్సులో పెట్టుకొనే ఇప్పుడు వేధిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఈనాడు నుండి తప్పుకున్న రామోజీరావు..!