పరిపాలనా రాజధానిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్ది కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. జూలైలో విశాఖకు షిప్ట్ అవుతున్నట్టు కేబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడినట్టు సమాచారం. ఆ సమయం వరకు అందరూ రెడీగా ఉండాలని ఆయన సూచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను మంత్రులకు అప్పగించారు. మరోవైపు కొందరు మంత్రుల పనితీరుపై ఆయన అసంతృప్తిగా వున్నారని సమాచారం. పనితీరు మార్చుకోకపోతే వారిని తప్పిస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలు ధీటుగా సమాధానం ఇవ్వాలని మంత్రులకు ఆయన సూచించారు.
రాబోయే కాలం చాలా కీలకమని, జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఇక ఈ నెల 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయించినట్టు చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ…. గవర్నర్ ప్రసంగానికి రేపు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. 16న బడ్జెట్ ను సభవలో ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. 22న ఉగాది పండుగ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ఉంటుందని పేర్కొన్నారు.