రాష్ట్ర ఎన్నికల సంఘంతో పంచాయితీ ఎన్నికల్లో జరిగిన పంచాయితీలో జగన్ సర్కార్ ఓటమి అంగీకరించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమిషనర్ గా ఉండగా ఎన్నికలకు వెళ్లొద్దు అని పంతానికి పోయినా… రాజ్యాంగ సంస్థల బలం ఏంటో మరోసారి రుచిచూడాల్సి వచ్చింది.
సుప్రీం తీర్పు తర్వాత ఎన్నికల సంఘం లైన్ లోకి వచ్చిన జగన్ సర్కార్… మరో మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయితీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ లు తన ఆదేశాలు పట్టించుకోవటం లేదని, మీటింగ్ లకు పిలిచినా రావటం లేదని, వారి కారణంగానే 3లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు కోల్పోయాని నిమ్మగడ్డ ఆరోపించారు. వారిపై సరైన సమయంలో చర్యలుంటాయని హెచ్చరించారు.
కోర్టు తీర్పు తర్వాత పాలన అంతా కమిషన్ చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ ఇద్దరు అధికారులను ఎలాగైనా నిమ్మగడ్డ కనపడకుండా చేస్తారు. ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ ఎందుకు అనుకున్నట్లుగా ఉన్నారు… వెంటనే ఆ ఇద్దరు అధికారులను సర్కార్ బదిలీ చేసింది. నిమ్మగడ్డ చేతిలో వేటు పడకుండా చూసింది. కానీ దీనిపై నిమ్మగడ్డ డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున… మీకు బదిలీ చేసే అధికారం లేదని, ఆ బదిలీలు చట్టబద్ధం కావని స్పష్టం చేశారు.
మరీ ఈ గొడవ ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.