అమరావతి రైతుల ఉద్యమం సంవత్సరం పూర్తైన సందర్భంగా ఓవైపు జనభేరి సభ నడుస్తుంటే… మరోవైపు సీఎం జగన్ ఉద్యమం ఘాటుగా వ్యాఖ్యానించారు. అమరావతి ఉద్యమం ఓ రియల్ ఎస్టేట్ ఉద్యమం అంటూ కామెంట్ చేశారు.
అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా అభివర్ణిస్తూ… వైసీపీ సర్కార్ ముందు నుండి ఎదురుదాడి చేస్తుంది. కేవలం కొంతమంది ప్రయోజనాల కోసమే రాజధాని అని పేరు పెట్టారని, అందుకే తాము మూడు రాజధానులను తెరమీదకు తెచ్చామని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తూ వచ్చారు.
అమరావతి చుట్టూ ఇన్ సైడ్ ట్రేడింగ్ ద్వారా భూములు కొనుకున్న వారే ఎక్కువగా భయపడుతున్నారని, ఇప్పుడా రేట్లు పడిపోతాయన్నదే వారి భయం అంటూ జగన్ కామెంట్ చేశారు. దీనిపై చంద్రబాబు కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని, ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ సంక్రాంతి సభలో ఆయన పాల్గొన్నారు.