నారా లోకేష్‌పై సీఎం జగన్ పగ సాధిస్తున్నారా…? కావాలనే ప్రభుత్వం లోకేష్ భద్రత కుదిస్తోందా…? సీఎం జగన్ అధికారంలోకి రాగానే రెండు సార్లు భద్రత తగ్గించటం లో అంతరార్థం అదేనా…? భద్రతపై లోకేష్ లేఖలు పోలీసులు పట్టించుకోవటం లేదా…?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. జెడ్ కేటగిరి భద్రతలో ఉండే టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు ముందుగా వై ప్లస్ కేటగిరికి మార్చారని, తాజాగా వై ప్లస్ నుండి ఎక్స్ కేటగిరికి మార్చారని… ఇలా భద్రతను తగ్గించటం రాజకీయ కుట్ర అని ఆరోపిస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రెండు సార్లు భద్రత కుదించారిన టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తుండగా… తన భద్రతలో లోపాలను ప్రస్తావిస్తూ స్వయంగా లోకేష్ ఎనిమిది సార్లు ప్రభుత్వానికి లేఖ రాసినా, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్ ప్రభుత్వం లోకేష్ భద్రను కుదిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.