ఓవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నేతృత్వంలోని అధికారుల బృందం ఎన్నికల కమిషనర్ ను కలిసి రాగానే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కరోనా వైరస్, వ్యాక్సినేషన్ కారణంగా ఎన్నికలు సాధ్యంకాదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటింది. కానీ అమెరికాలో అన్ని కేసులున్నా అధ్యక్ష ఎన్నికలు జరిగాయంటూ కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించింది.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జనవరి 9 నుండే ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి రాగా… ఫిబ్రవరి 5, 9,13,17తేదీల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది. దీంతో కమిషన్ ఏకపక్షంగా ఎన్నికల తేదీలు ప్రకటించిందని ఆగ్రహాం వ్యక్తం చేస్తూ సర్కార్ న్యాయపోరాటానికి రెడీ అయ్యింది.
ఎన్నికల నిర్వహణపై కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని ఇప్పటికే హైకోర్టు చెప్పింది. అయితే, వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉండటంతో ఎన్నికలు సరికాదంటూ సర్కార్ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేయనుంది. కోర్టుకు సెలవులున్నప్పటికీ అత్యవసర పిటిషన్ వేయటంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అవసరం అయితే సుప్రీం తలుపుతట్టేందుకు కూడా రెడీ కావాలని సర్కార్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.