ఏపీ సీఎం జగన్‌కు అదృష్టం మరోసారి కలిసి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హజరయ్యేందుకు జగన్ విముఖత చూపుతూ వచ్చారు. వరుసగా అబ్సెంట్ పిటిషన్లు వేయటం లేదా తను సీఎం హోదాలో ఉన్నందున వ్యక్తిగత హజరు నుండి మినహయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేస్తూ కాలం వెల్లదీస్తూ వస్తున్నారు.
అయితే, వ్యక్తిగత హజరు నుండి మినహయింపు పిటిషన్లపై సీబీఐ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయటంతో… జగన్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ అనూహ్యంగా తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవటంతో శుక్రవారం కోర్టుకు రావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు కూడా సీబీఐ కోర్టు వద్ద భద్రత ఏర్పాటు చేశారు.
కానీ అనుకోకుండా సీఎం జగన్‌కు ఈసారి అదృష్టం కలిసి వచ్చింది. సీబీఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా జగన్ కోర్టుకు హజరు అవ్వటం లేదు. సీఎం జగన్ పర్యటన రద్దవటంతో కోర్టు వద్ద భద్రతను పోలీసులు ఉపసంహరించుకున్నారు.