ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలతో కరోనా వైరస్ కేసులు పెరిగిన మాట వాస్తవమే అయినా… దీన్ని మతం కోణంలో చూడవద్దని సీఎం జగన్ పిలుపునిచ్చారు. దీన్ని ఏ ఒక్కరికో ఆపాదించవద్దని, భారతీయులంతా ఒక్కటి అన్న అంశాన్ని చాటాలని అన్నారు. కుల, మత ప్రాంత భేదాలు కరోనా వైరస్ లేవని… ప్రధాని మోడీ పిలుపునిచ్చిన దీపాలు వెలిగించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.
ఢిల్లీ ప్రార్థనలకు దేశంలోని అనేక ప్రాంతాల నుండి, దేశాల నుండి వచ్చారని… ఆ మీటింగ్ కు వెళ్లిన వారిలో చాలా మందికి కరోనా వ్యాధి సోకిందన్నారు. ఏ మతానికి సంబంధించిన కార్యక్రమంలో అయినా ఇలాంటివి జరగవచ్చని, లక్షల మంది అన్ని మతాల్లోనూ సభలు ఉంటాయని… జగ్గీవాసుదేవ్ ఈషా ఫౌండేషన్ లో కానీ, మాత అమృతారంజమయి కార్యక్రమంలో కానీ జాన్ వెస్లీ ఆద్మాత్మిక కార్యక్రమంలో, పాల్ దినకరన్ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొన్నా… ఇలాంటివి జరగవచ్చని, అంత మాత్రానా వారు నేరం చేసినట్లుగా ఎవరూ చేయకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించటంతో పాటు లాక్ డౌన్ నిబంధనలను పాటించాలన్నారు.