హైదరాబాద్ లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని.. గతంలో ఆరేడు మాత్రమే ఉండేవని చెప్పారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. చాలా మార్కెట్లు పరిశుభ్రంగా లేవన్నారు. ప్రతీ నియోజకవర్గంలో అధునిక వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
గతంలో శాస్త్రీయ ధృక్పథం లేకుండా మార్కెట్లను నిర్మించారని.. మోండా మార్కెట్ ను చాలా సైంటిఫిక్ గా కట్టారని వివరించారు. అలాంటి మార్కెట్లు నిర్మించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు దానిని నమునాగా చూపించామని తెలిపారు. నగరంలో చాలా చోట్ల కొత్తవి ఏర్పాటు చేస్తున్నామని.. ప్రతీ అంసెబ్లీ సెగ్మెంట్ లోనూ ఇంటిగ్రేటేడ్ మార్కెట్లు నిర్మిస్తామని చెప్పారు సీఎం.
కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నారాయణపేట కూరగాయల మార్కెట్ చాలా అద్భుతంగా కట్టినట్లు తాను విన్నానని.. ఇతర రాష్ట్రాల అధికారులు మన మార్కెట్లు చూసి స్ఫూర్తి పొందుతున్నారని అన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్తీ విత్తనాలపై స్పందించారు సీఎం. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టడంతో పాటు.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.