ఆరోగ్య శాఖ మంత్రిగా లక్ష్మారెడ్డి ఉన్న టైంలో నాలుగు ఆసుపత్రుల నిర్మాణం అంటూ కేసీఆర్ ప్రకటన చేశారు. కేసీఆర్ మొదటిసారి సీఎం అయినప్పుడు ఇచ్చిన హామీ అది. హైదరాబాద్ నగరం చుట్టూ నాలుగు వైపుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
కానీ ఆరోగ్యశాఖకు ఎంతో మంది మంత్రులు మారారు. ఆసుపత్రుల నిర్మాణం అటుంచి కనీసం భూమి పూజకు కూడా నోచుకోలేదు. కానీ ఇప్పుడు మళ్లీ నాలుగు ఆసుపత్రులంటూ ప్రభుత్వం కొత్తగా ప్రకటన చేసింది. క్యాబినెట్ మీటింగ్ లో కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ అంటూ గొప్పగా ప్రకటించుకుంది.
అసలే గాంధీని కరోనాకు వాడుతున్నారు. ఉస్మానియా పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకేముంది తెలంగాణ స్వరాష్ట్రంలో పేదొడికి వైద్యం అందటం గగనమైపోతుంది. కనీసం ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ ఆసుపత్రుల నిర్మాణం ప్రగతి భవన్ నిర్మాణమంత వేగంగా, కొత్త సచివాలయం అంతా ఫాస్ట్ గా, కాళేశ్వరం అంత మెరుపు వేగంతో చేయాలి అంటూ ప్రతిపక్ష నేతలు సెటైర్స్ వేస్తున్నారు.