సర్పంచ్ ల కోసం సెక్రెటరీలను కేసీఆర్ సర్కార్ ఫణంగా పెట్టిందా…? సర్పంచ్ ల అసంతృప్తి తగ్గించేందుకు పంచాయితీ కార్యదర్శుల రాజ్యంగ హక్కులను కాలరాసిందా…? అసలే పనిభారంతో మానసిక వేధనకు గురవుతున్న పంచాయితీ సెక్రెటరీలకు ఇప్పుడు కనీస గౌరవం దక్కకుండా చేస్తుందా…?
తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లలో అసంతృప్తి పెరిగిపోతుంది అన్నది బహిరంగ రహస్యమే. వీరిని సంతృప్తిపర్చాలనుకుందో… ఏమో… పంచాయితీ సెక్రెటరీల హక్కును కూడా సర్పంచ్ లకు సమర్పించారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతి గ్రామానికి కార్యనిర్వాహక అధికారి పంచాయితీ సెక్రెటరీయే. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పంచాయితీ ఆఫీసు ముందు జెండా ఎగురవేయాల్సిన గౌరవం వారిదే. అందుకు అనుగుణంగానే పలు జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వారే జెండా ఎగురవేస్తారని సర్కులర్ పంపించారు. కానీ హాఠాత్తుగా ఏమైందో కానీ రాత్రికి రాత్రే ఆదేశాలు మారిపోయాయి. పంచాయితీ సెక్రెటరీలు కాదు సర్పంచ్ లు జెండా ఎగురవేస్తారంటూ ఆదేశాలు జారీ అయిపోయాయి. కొన్ని జిల్లాల్లో అధికారికంగా మరో సర్కూలర్ రాగా… కొన్ని చోట్ల మౌఖిక ఆదేశాలు వచ్చేశాయి. కొత్త పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ లకే ఆ అధికారం అని మంత్రులు కూడా వాదిస్తున్ట్నట్లు తెలుస్తోంది.
కానీ కొత్త చట్టం వచ్చింది 2018లో. ఆ తర్వాత వచ్చిన రిపబ్లిక్ డే వేడుకల్లో పంచాయితీ కార్యదర్శులే జెండా ఎగురవేశారు. కానీ ఈ ఒక్కసారే ఎందుకు మారినట్లు…? రాజకీయ జోక్యంతోనే మారిందని స్పష్టంగా కనపడుతుంది కదా…? అన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. భారత రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్దంగా ఇలా గ్రామ స్థాయిలో ఉండే కార్యనిర్వహన అధికారి యొక్క ఆత్మభిమానాన్ని అంగట్లో పెట్టి అమ్ముతున్న రాజకీయ శక్తి …ఇలా నిమిషాల వ్యవధిలో సర్కులర్ లను మార్చేసి తిరగరాస్తున్నారంటూ కార్యదర్శులు మండిపడుతున్నారు.