43 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా…ప్రభుత్వం పట్టించుకోకుండా నియంతృత్వంగా వ్యవహరించడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు డీకే అరుణ మండిపడ్డారు. పాలమూరు జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష చేస్తున్న మహిళా కార్మికులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మహిళా కార్మికులకు ఏం జరిగినా దానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు భరోసా కల్పించి.. వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఒక మెట్టు కిందకు దిగినా…కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు.. కార్మికులు ఎవరు అధైర్య పడొద్దని… డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.