ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితర సాధ్యుడని అన్నారు. సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన శేఖరుడని చెప్పారు. కేసీఆర్ అంటే కారణజన్ముడిగా, చిరస్మరణీయుడిగా, ప్రజల తలరాతలను మార్చే మహనీయుడిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ ఈ మట్టి బిడ్డ కావడం గర్వకారణమని మంత్రి అన్నారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు… పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారుల మధ్య వేడుకలు నిర్వహించారు.
రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శమన్న ఆయన… తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో బ్రతికేలా కేసీఆర్ కృషి చేశారని హరీష్ రావు చెప్పారు. బడ్జెట్ లో రైతు బంధు కోసం కేసీఆర్ రూ.65వేల కోట్లు కేటాయించారని. పేర్కొన్నారు.
అభివృద్ధిలో, సంక్షేమంలో కేసీఆర్ తెలంగాణను ముందుండి నడిపిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభమని హరీష్ రావు అన్నారు.
❇️సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు..
❇️తెలంగాణ ప్రజలకు స్వేఛ్చా వాయువులు ప్రసాదించిన శేఖరుడు..
❇️కాళేశ్వర గంగను దివి నుంచి భువికి దించిన అపర భగీరథుడు..
❇️తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చిన రైతుబాంధవుడు..
❇️అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితరసాధ్యుడు
1/2 pic.twitter.com/qmm4vMBji1— Harish Rao Thanneeru (@BRSHarish) February 17, 2023