సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు పెద్ద పండగ. అంతే కాదు సినీ అభిమానులకు పండగ మరింత ఎక్కువగా ఉంటుంది. అగ్ర హీరోలందరూ సంక్రాంతికి సినిమాలతో క్యూ కడుతూ ఉంటారు. ఈ సారి కూడా సరిలేరునీకెవ్వరు సినిమాతో మహేష్, అల వైకుంఠపురములో సినిమాతో అల్లుఅర్జున్, ఎంతమంచివాడవురాతో కళ్యాణ్ రామ్ వస్తున్నారు. ఇప్పటికే దర్బార్ సినిమాతో రజిని ప్రేక్షకుల ముందు వచ్చేశాడు. అయితే తెలుగు రాష్ట్ర సీఎంలు కూడా టాలీవుడ్ హీరోలకు బంపర్ ఆఫర్ ఇచ్చేశారు.
ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ ఆరుషో లు వెయ్యటానికి పర్మిషన్ ఇచ్చేసింది. ఇప్పుడు తాజాగా కేసీఆర్ కూడా సంక్రాంతి సందర్భంగా ఆరు షో లు ప్రదర్శించటానికి పర్మిషన్ ఇచ్చారు. ఇద్దరు సీఎంల నిర్ణయంతో డిస్ట్రిబ్యూటర్లు సంబరాలు చేసుకుంటున్నారు. నైజాంలో ఈ రెండు సినిమాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. దాంతో భారీగానే వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
Advertisements