అనుకున్నట్లే కేసీఆర్ హుజూర్‌నగర్ మీటింగ్‌కు గైర్హాజరయ్యారు. ఓవైపు ఆర్టీసీ కార్మికుల తిరుగుబాటు, మరోవైపు సమ్మెతో ప్రజలు ఆల్లాడుతున్న సందర్భంలో… కేసీఆర్ ప్రచారం ఉంటుందా ఉండదా అన్న ఉత్కంఠ కొనసాగింది. అందరూ ఊహించినట్లుగానే ఆయన చివరి నిమిషంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారన్న అభిప్రాయం వినపడుతోంది.
హుజూర్‌నగర్‌లో సీఎం ప్రచారం చేస్తారని, భారీ బహిరంగ సభ ఉంటుందని టీఆర్ఎస్ చెప్తూ వస్తోంది. అయితే, ఆ సభకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం, ఆర్టీసీ సమ్మె గురించి ప్రజల్లోకి వెళ్లే సమయంలోనూ మాట్లాడకపోతే తప్పుడు సంకేతాలు పోయి, మొదటికే మోసం వస్తుందని సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్ సభకు వెళ్లలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏం చెప్పాలో తెలియకే మొహం చాటేశారని అభిప్రాయపడుతున్నారు.
అయితే, సీఎంవో మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తోంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో… ఏవియేషన్ హెలికాప్టర్ ఫ్లైయింగ్‌కు నిరాకరించిందని, అందుకే పర్యటన అర్ధాంతరంగా రద్దయిందని ప్రకటన విడుదల చేసింది.