ఆర్టీసీ ముగిసిన అధ్యాయం అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఇప్పటికే భారీ నష్టాల్లో ఆర్టీసీ ఉందని, దాదాపు 5000కోట్ల అప్పులున్నాయని… కొత్త బస్సులు కొనాల్సి ఉందని సీఎం స్పష్టం చేశారు. లంగ ప్రచారం చేస్తూ… అసంబద్ద సమ్మెకు వెళ్లారని, సమ్మెకు వెళ్లి… వాళ్లే ఆర్టీసీని ముగించారని స్పష్టం చేశారు.
కేంద్రమే ఇటీవల చట్టం తెచ్చి… ఆర్టీసీని రాష్ట్రాలకు అప్పజెప్పిందని, కోర్టులు కూడా ఇందులో ఏమీ చేయలేవని తేల్చి చెప్పారు. యూనియన్ నాయకుల తప్పిదానికి కార్మికులు బలైపోయారని, ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని స్పష్టం చేశారు. వాళ్ల కుటుంబ సభ్యులపై కార్మికులకే సోయి లేదని… మీరు రోడ్డున పడితే ఎవరేం చేస్తారని ప్రశ్నించారు సీఎం.
ఆర్టీసీకి 60వేల కోట్ల ఆస్తులున్నాయని.. ఎవరో అంటే మీరెట్ల అడుగుతరంటూ జర్నలిస్ట్‌లపై ఫైర్ అయ్యారు సీఎం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అసంభవం అని తేల్చి చెప్పారు. సీఎంనే యూనియన్ నాయకులు తిడుతరా…. మీ మాటల వెనుక అర్థం ఏంటీ అని ప్రశ్నించారు. ఓళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని… వీడెవడో తోకగాడు చెప్తే అసెంబ్లీని రద్దు చేస్తారా… ఇప్పుడెవడు కూలుతుర్రో కనపడత లేదా అని ప్రశ్నించారు.
కార్మికులు అమాయకులు అయితే… దరఖాస్తు పెట్టుకొని ఎక్కడి వారు అక్కడే జాయిన్ కావాలని తెలిపారు. సంస్థనే పోతుంటే యూనియన్ ఎక్కడిదని ప్రశ్నించారు.