కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ ప్రకటించింది. మార్చి 31వరకు ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని…కరోనాపై సక్సెస్ అవ్వాలంటే ప్రస్తుతానికి ఇంతకు మించి మరో మార్గం లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు ఫ్రీ రేషన్ తోపాటు కుటుంబానికి 1500 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనాని నిర్మూలనకు కఠిన నిర్ణయాలను అమలు చేస్తోన్న కొంతమంది మాత్రం బయటకు వచ్చి లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తోండటంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు సీఎం కేసీఆర్ మంగళవారం జిల్లా ఎస్పీ,కలెక్టర్లతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదని కేసీఆర్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే మీడియా సమావేశంలో ఆయన పదేపదే ప్రజలు సహకరించాలంటూ విజ్ఞప్తి చేయడం కనిపించింది.
అన్ని విషయాలను కూలంకషంగా వివరించిన సీఎం కేసీఆర్ ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న నిర్ణయాలను పాటించకపోతే భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడాలేడు… దయచేసి షూట్ ఎట్ సైట్ పరిస్థితిని కొనితెచ్చుకొవద్దని హెచ్చరించారు. అయితే సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే భయోత్పాతాన్ని కళ్ళముందు ఉంచిందని విశ్లేషకులు అంటున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఆర్మీ రంగంలోకి దించిన పరిస్థితులున్నాయని…ఇక్కడ కూడా అలాంటి సిట్యుయేషన్ తీసుకురావొద్దన్నారు. కనుక ప్రజలు కూడా ప్రభుత్వం తీలుకుంటున్న నిర్ణయాలను పాటించాలని కోరుతున్నారు. లేకపోతే నిజంగానే కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా రాష్ట్ర ప్రజల్ని భగవంతుడు కూడా కాపాడలేడని అంటున్నారు.