ఢిల్లీ విద్యా విధానం దేశానికే ఆదర్శంగా ఉందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అక్కడి సీఎం కేజ్రీవాల్ తో కలిసి సర్వోదయ పాఠశాల, మొహల్లా క్లినిక్ లను సందర్శించారు. తొలుత దక్షిణ మోతీబాగ్ లో ఉన్న సర్వోదయ పాఠశాలకు వెళ్లారు. అక్కడి సౌకర్యాలు, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
దేశమంతటా ఢిల్లీ తరహా ఎడ్యుకేషన్ విధానం ఉండాలన్నారు కేసీఆర్. కానీ.. కేంద్రం తెచ్చిన కొత్త విధానం ఏకపక్షంగా ఉందని విమర్శించారు. ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు ఎదురవుతాయని అన్నారు. తెలంగాణలో ఢిల్లీ తరహా విధానాన్ని అమలు చేయకపోయినా.. తమ టీచర్లను పంపి ఓరియెంటేషన్ కల్పిస్తామని ప్రకటించారు.
కేజ్రీవాల్ తన సొంత విధానాలతో పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు కేసీఆర్. పాఠశాలలో అధునాతనంగా వసతులు అందుతున్నాయని కొనియాడారు. విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వ విధానం ప్రశంసనీయమన్నారు.
Advertisements
మరోవైపు దేశంలో సంచలనం రావాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్.. అది తప్పకుండా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలన్నారు. స్కూల్ సందర్శన తర్వాత మొహల్లా క్లినిక్ కు వెళ్లారు కేసీఆర్.