మొన్నటి వరకు నియంత్రిత సాగే శ్రీరామరక్ష అన్నాడు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు పనికి రావని చెబుతూ… మంత్రులతో సహా టీఆర్ఎస్ నేతలను బంద్ లో భాగం చేశాడు. సీన్ కట్ చేస్తే ధాన్యం కొనటం మా వల్ల కాదు… వచ్చే ఏడాది నుండి ఊర్లలో పంట కొనుగోళ్లు కూడా ఉండవంటూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు.
ధాన్యం కొనటం మా వల్ల కాదని, రైతులకు మద్ధతు ధర ఇచ్చి పంటలు కొనటం వల్ల 7500కోట్లు నష్టపోయామంటూ తేల్చారు. దీనిపై అన్ని వర్గాల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మద్ధతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ మాట మరిచి మీ ఇష్టం ఉన్న పంటవేసుకొండి… ఇక నుండి ఊర్లలో మేం కొనం అంటూ ప్రకటించటం చేతకాని తనమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మద్ధతు ధరకు ధాన్యం కొనాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఊర్లలో కొనం అని చెప్పటంతో మరోసారి దళారీ వ్యవస్థ మొదలుకానుంది. అప్పుడు మళ్లీ నష్టపోయేది రైతులే… ఆ పాపం కూడా మళ్లీ కేసీఆర్ కే తగులుతుందని మండిపడుతున్నారు.
ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎన్నోవర్గాలకు ప్రొత్సహాకాలు ఇచ్చారు. కానీ రైతుల కోసం 7500కోట్లు భరించలేరా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మేం వ్యాపారులం కాదు అంటూనే… సర్కార్ వ్యాపార సంస్థలా వ్యవహరిస్తుందని, వ్యాపార సంస్థలు మాత్రమే ప్రతి యేటా లాభనష్టాలు అంచనా వేస్తాయని, రైతుల సంక్షేమం కోసం ఆలోచించే నాయకత్వమే అయితే మరో 10వేల కోట్ల నష్టం వచ్చినా భరించేవారంటూ రైతుల సంఘాల నేతల మండిపడుతున్నారు. ఐకేపీ సెంటర్లను సైతం మూసేస్తామనం బెదిరింపులకు దిగటమేనంటూ ఆరోపిస్తున్నారు.